మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 మే 2020 (09:44 IST)

పవన్ పెట్టిన భిక్ష - బండ్ల గణేష్ ఇంట్లో 'గబ్బర్ సింగ్' హోమం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'గబ్బర్ సింగ్'. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయింది. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. 
 
ఈ అరుదైన రోజును పురస్కరించుకుని బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. 'తింటే గారెలు తినాలి వింటే రామాయణం వినాలి తీస్తే 'గబ్బర్ సింగ్' తీయాలి ఇది నా అదృష్టం జై పవర్ స్టార్' అంటూ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
'ఈ రోజుల్లో నిన్న అనే రోజున పొందిన సహాయాన్ని మర్చిపోయి మళ్లీ ఎదురు తిరిగి వారిని ప్రశ్నిస్తారు కానీ నేను మాత్రం ఈ జన్మంతా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను' అని ట్వీట్ చేశారు.
 
ఇంకో ట్వీట్‌లో 'గబ్బర్ సింగ్ ఇది. ఇది నాకు నా దైవసమానులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన భిక్ష ఎప్పటికీ నేను కృతజ్ఞుణ్ణి' అంటూ పేర్కొన్నాడు. 
 
మరో ట్వీట్‌లో 'అందరూ పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు హోమం చేసుకుంటారు. నేను నా కుటుంబ సభ్యులతో 'గబ్బర్ సింగ్' విడుదల రోజు గణపతి హోమం చేశాను' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.