శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (09:11 IST)

తీవ్ర అస్వస్థతకు లోనైన బాలీవుడ్ దిగ్గజం రిషి కపూర్

బాలీవుడ్ దిగ్గజాల్లో ఒకరైన రిషి కపూర్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కుటుంబ సభ్యుల సమాచారం. 
 
బుధవారం రాత్రి ఉన్నట్టుండి ఆయన రిషి కపూర్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు రణధీర్ కపూర్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రిషి కపూర్ వద్ద ఆయన సతీమణి నీతూ కపూర్ ఉన్నారు. పైగా, ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. 
 
కాగా, గత 2018లో కేన్సర్ బారినపడిన రిషి కపూర్ ఆ తర్వాత కోలుకున్నారు. రిషికపూర్ ఇటీవల ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించారు. అంతలోనే ఆయన అనారోగ్యం పాలవడం కుటుంబ సభ్యులను ఆందోళనలోకి నెట్టేసింది. 
 
లాక్‌డౌన్ సమయంలో కూడా ఆయన ఇంట్లోనే యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ ఫోటోలను ఆయన ఆయన భార్య ఇటీవల సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది.