సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (12:04 IST)

ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం విషమం.. పెద్ద పేగు వ్యాధితో సమస్య

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. దీంతో ఆయన మృతి చెందారంటూ బాలీవుడ్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. నిజానికి ఆయన కేన్సర్ బారినపడ్డారు. ఆ తర్వాత ఈ వ్యాధికి చికిత్స తీసుకుని కోలుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయనకు పెద్ద పేగు వ్యాధి సోకింది. దీంతో ఇపుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 
 
ప్రస్తుతం ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. పెద్ద పేగు సంబంధిత వ్యాధి సోకడంతో, ముంబయిలోని కిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతని ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసిన బంధుమిత్రులు, కొందరు పనిగట్టుకుని ఇర్ఫాన్ మరణించాడని ప్రచారం చేస్తున్నారని, అతనింకా చనిపోలేదని తెలిపారు. 
 
అభిమానుల్లో ఆందోళన కలిగించే ప్రచారం చేయవద్దని, ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా, కోలుకుంటారన్న నమ్మకం ఉందని తెలిపారు. కాగా, ఇర్ఫాన్ తల్లి సైదా బేగమ్ శనివారం నాడు కన్నుమూయగా, లాక్‌‌డౌన్‌తో పాటు ఆరోగ్యం విషమంగా ఉన్న కారణంగా అంత్యక్రియలకు ఇర్ఫాన్ హాజరు కాలేకపోయారు. అంత్యక్రియలను కూడా వీడియో కాలింగ్‌లోనే చూశారు. ఇపుడు ఆయన ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.