శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: సోమవారం, 27 ఏప్రియల్ 2020 (21:29 IST)

కరోనా సోకిందని ఆసుపత్రి భవనం నుంచి దూకిన యువకుడు, ఆ తరువాత?

అసలే డయాలసిస్ పేషెంట్. 15 సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నాడు. వారానికి ఒకసారి డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి. దీనికితోడు కరోనా పాజిటివ్ సోకింది. ఇంకేముంది ఆసుపత్రికి వచ్చాడు. ఒకరోజు పాటు ఆసుపత్రిలో ఉన్నాడు. కానీ కరోనా అంటే భయపడిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు.
 
బెంగుళూరులోని విక్టోరియా ఆసుపత్రి మిద్దెపై నుంచి దూకి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు స్వస్థలం బెంగుళూరు తిలక్ నగర్. వయస్సు 30 సంవత్సరాలు. చిన్నతనంలోనే మూత్రపిండాల సమస్యతో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు.
 
ఈ నెల 24వ తేదీన ఆసుపత్రికి వచ్చాడు. దగ్గు, జలుబు ఎక్కువగా ఉండటంతో పాటు మూత్రపిండాల సమస్యతో ఆసుపత్రిలో చేరాడు. అతనికి కరోనా ఉందంటే అతనే నమ్మలేదు. తన ఇంటి పక్కనున్న వ్యక్తి ఢిల్లీ నుంచి రావడం అతని ద్వారా కరోనా వచ్చినట్లు వైద్యులు నిర్థారించారు.
 
అయితే నిన్న రాత్రి ఆసుపత్రిలోని క్వారంటైన్లో ఉన్న సయ్యద్ సోమవారం ఉదయం 9గంటలకు ఆసుపత్రి భవనంపైకి వెళ్ళాడు. అక్కడి నుంచి కిందకు దూకేశాడు. స్పాట్లోనే చనిపోయాడు. నిన్న రాత్రే తనకు కరోనా వైరస్ అంటే భయంగా ఉందని నర్సులకు సయ్యద్ చెప్పారట. అయితే 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటే సరిపోతుందని.. ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సిబ్బంది నచ్చజెప్పారట. 
 
అయితే రాత్రంతా నిద్రపోకుండా ఆలోచనలో పడిపోయిన సయ్యద్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యకు చేసుకున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ సోకిందని బెంగుళూరులో ఆసుపత్రి భవనం నుంచి యువకుడు దూకి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.