శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:34 IST)

భోపాల్‌లో సామూహిక అత్యాచారం.. నడుచుకుంటూ వెళ్లిన బాలికపై..?

కరోనాతో ప్రపంచ దేశాలు అట్టుడికిపోతుంటే.. కామంతో కళ్లు ముసుకుపోయిన కామాంధుల ఆగడాలు తగ్గడం లేదు. తాజాగా ఓ మైనర్ బాలికను ఇద్దరు కామాంధులు కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 18న గోవింద్‌పూర్‌లోని జేపీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన 17ఏళ్ల బాలిక నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది.
 
ఆమెను గమనించిన ఇద్దరు కామాంధులు అడ్డగించి కారులోకి లాగారు. ఆ తర్వాత ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం బాలికను దారుణంగా అక్కడే వదిలేసిన నింధితులు కారులో పారిపోయారు. 
 
ఈ విషయాన్ని బాలిక తన స్నేహితురాలికి చెప్పగా ఆమె సలహాతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టం కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన గోవింద్‌పూర్ పోలీసులు నింధితుల కోసం గాలిస్తున్నారు.