ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (15:52 IST)

ముంబై పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం ... ఖాకీలకు శుభవార్త

ముంబై పోలీస్ కమిషనర్ చీఫ్ పరంబీర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో ఆయన ముంబై పోలీసులకు శుభవార్త చెప్పారు. 55 యేళ్లు దాటిన పోలీసులు ఎవరూ విధులకు హాజరుకావొద్దని ఆయన ఆదేశాలు జారీచేశారు. 
 
న‌గ‌రంలో ముగ్గురు పోలీసులు వైర‌స్ బారినప‌డ‌డం వ‌ల్ల పోలీసు శాఖ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. వైర‌స్‌ను సంపూర్ణంగా నియంత్రించేంత వ‌ర‌కు డ్యూటీకి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని అధికారులు స్ప‌ష్టంచేశారు.
 
గ‌త మూడు రోజుల్లో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. అయితే వారంతా 50 ఏళ్లు దాటినవారు కావ‌డం శోచ‌నీయం. 55 ఏళ్ల పైబ‌డిన వారికి వైర‌స్ త్వ‌ర‌గా సోకే ఛాన్సు ఉంటుంద‌ని ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది. 
 
దీంతో ఆయన ఈ కమిషనరు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపోతే, ముంబైలో క‌రోనా పాజిటివ్ కేసులు 6 వేల‌కు చేరుకున్నాయి. ఆ న‌గ‌రంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 219గా ఉన్న‌ది.