శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 30 ఏప్రియల్ 2020 (23:34 IST)

లైవ్ చాట్‌లో ఫ్యాన్స్ ముందు అలా ఫోజులిస్తున్న రష్మిక..

రష్మిక మందనా.. లాక్ డౌన్ సమయంలో బాగా ఎంజాయ్ చేస్తోందట. అది కూడా ఫ్రెండ్స్‌కి దూరంగా ఉన్నానని బాధపడుతోంది కానీ అభిమానులతో చాటింగ్ చేస్తూ ఆ బాధను మర్చిపోతోందట. రోజుకు పదిమంది స్నేహితులతో ఆమే స్వయంగా లైవ్ చాట్‌కు వస్తోందట. 
 
తనను బాగా అభిమానించే అభిమానుల లిస్టు రష్మిక మందన వద్ద ఉందట. వారితో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు లైవ్ వీడియో చాటింగ్ చేస్తోందట. తాను నటించిన సినిమాలు, ఇంకా నటించాల్సిన సినిమాలు.. తన నటనలలో ఎలాంటి మెళుకువలు నేర్చుకోవాల్సి ఉంది అనే విషయాలను అభిమానుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారట రష్మిక.
 
అయితే తన స్నేహితులను కలవకపోవడం బాధగా ఉందని చెబుతున్న రష్మిక. లాక్ డౌన్ ఎత్తేయగానే ముందుగా కలిసేది వారినేనని చెబుతోందట. నేను నా ఫ్రెండ్స్‌ని బాగా మిస్సవుతున్నా.. వారితో ఎక్కువ సేపు గడపడం నాకు ఇష్టం. 
 
లాక్ డౌన్ తరువాత హిందీ సినిమాలో నటించే ఛాన్సు వుంది. ఆ సినిమా కోసం హిందీ నేర్చుకుంటున్నాను..కొద్ది కొద్దిగా హీందీ తెలుసు నాకు అంతే.. పూర్తిగా రాదని అభిమానులకు చెబుతోందట రష్మిక. ఖాళీ సమయంలో హిందీ పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేస్తోందట.