మహేష్ బాబుకు నో చెప్పిన సాయిపల్లవి.. ఎందుకో తెలుసా? (video)
సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించే అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా.. అయితే ఫిదా భామ సాయిపల్లవి మాత్రం ఆ అవకాశాన్ని వదులుకుందట. అనిల్ రావిపూడి దర్వకత్వంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఉగాది సందర్భంగా బుల్లితెరపై ఈ మూవీ ప్రీమియర్ షో ప్రదర్శించగా.. అక్కడా అత్యధిక టీఆర్పీని సాధించి.. బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది.
కాగా ఈ మూవీలో మొదట హీరోయిన్‌గా సాయి పల్లవిని అనుకున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదించినట్లు కూడా సమాచారం. కానీ ఈ సినిమాలో నటించేందుకు ఆమె నో చెప్పిందట. ఇక ఆ తరువాత ఆ ఆఫర్ రష్మికకు వెళ్లినట్లు సమాచారం. సరిలేరు నీకెవ్వరులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని భావించిన సాయి పల్లవి.. ఆ ఆఫర్‌కు నో చెప్పినట్లు తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం సాయి పల్లవి, రానా విరాట పర్వం.. నాగ చైతన్య సరసన లవ్ స్టోరీలో నటిస్తోంది. వీటి తరువాత కిశోర్ తిరుమల తెరకెక్కించబోయే కామెడీ ఎంటర్‌టైనర్‌లో శర్వానంద్‌తో మరోసారి జోడీ కట్టబోతోంది సాయి పల్లవి.