సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (09:22 IST)

మ్యాట్రిమోని మోసగాడు తిరుపతిలో అదుపులోకి..

మ్యాట్రిమోని మోసగాడుగా పోలీసుల రికార్డులకెక్కిన వ్యక్తిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అందినకాడికి దండుకొని పారిపోతున్న మోసగాడు ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన కోరండ్ల కిరణ్‌కుమార్‌ రెడ్డి(29) అనే కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
కిరణ్‌తో పాటు ఇంకా ఎవరైనా స్నేహితులు ఉన్నారా? ఇప్పటివరకు ఎంత మంది మహిళలను మోసం చేశాడు? ఎంత డబ్బులు కాజేశాడు వంటి వివరాలను రాబట్టే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇతని వద్ద నలుగురు పోలీసు సభ్యుల బృందం విచారణ జరుపుతోంది.