శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (16:18 IST)

జగనన్న ఇళ్ల పథకంపై హైకోర్టు స్టే.. తీర్పు హర్షణీయమన్న రామకృష్ణ

జగన్ సర్కారుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి ఊహించని షాకిచ్చింది. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో తాత్కాలికంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. 
 
పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం కేటాయింపును తీవ్రంగా తప్పుబట్టింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టును ఆశ్రయించిన 128 మంది పిటిషనర్ల వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు .. 108 పేజీల తుది తీర్పును వెలువరించింది.
 
పేదలకు స్థలాలు, జగనన్న ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పుపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. ధర్మాసనం ఇచ్చిన తీర్పు హర్షణీయమని పేర్కొన్నారు. సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు తెలిపారు. 
 
పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున కేటాయించాలని ముందే చెప్పామని రామకృష్ణ వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేలు ఏ మాత్రం సరిపోవని... అందువల్ల రాష్ట్ర ప్రభుత్వమే నివాసయోగ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని స్పష్టం చేశారు.