విద్యుత్ - ఇంధన ధరల అదుపునకు చర్యలు తీసుకోండి..
విద్యుత్, ఇంధన ధరల అదుపునకు చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ లేఖ రాశారు. ముఖ్యంగా, ఇంధన ధరల అదుపనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
'కోవిడ్ తర్వాత గత ఆరు నెలల్లో విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగింది. గత ఒక్కనెలలోనే విద్యుత్ డిమాండ్ 20 శాతానికిపైగా పెరిగింది. విద్యుత్ కొనుగోలు చేయాలంటే కొన్ని సందర్భాల్లో యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తుందని' అంటూ సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు.
'రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్ కొనుగోలు చేయాలన్నా అందుబాటులో ఉండటం లేదు. ఏపీ థర్మల్ ప్రాజెక్టులకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాలని కోరుతున్నాం. కొంతకాలంగా పనిచేయని బొగ్గు ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి.
ఓఎన్‌జీసీ, రియలన్స్ ద్వారా ఏపీకి అత్యవసర ప్రాతిపదికన గ్యాస్ సరఫరా చేయాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్ డిస్కంలకు బ్యాంకుల ద్వారా సులభతరమైన రుణాలివ్వాలి. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలను పునరుద్ధరించి మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని' సీఎం వైఎస్ జగన్ లేఖలో కోరారు.