బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (13:55 IST)

జగన్ తరపున వకాల్తా పుచ్చుకోవడానికి సిగ్గులేదా : పోసానిపై టీడీపీ

ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తరపున వకాల్తా పుచ్చుకోవడానికి సిగ్గులేదా అంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు మండిపడ్డారు. జగన్‌ను ఏమైనా అంటే ఊరుకోబోనంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
 
దీనిపై పోసానిపై టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పవన్‌పై పోసాని చేసిన వ్యాఖ్యల వెనుక జగన్ ఉన్నారని ఆరోపించారు. జగన్ తరపున వకాల్తా పుచ్చుకోవడానికి పోసాని సిగ్గుపడాలని అన్నారు. తన నవరసాలను పోసాని తాడేపల్లిలో చూపించుకోవాలని చెప్పారు.
 
ఆడవాళ్ల గురించి పోసాని అసభ్యంగా మాట్లాడారని... ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సంస్కారం గురించి మాట్లాడే అర్హత పోసానికి లేదని అన్నారు. పోసానికి కొడాలి నాని, ధర్మాన, ఎమ్మెల్యే ద్వారంపూడి సంస్కారం నేర్పించగలరా? అని ఎద్దేవా చేశారు.