1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Jagan Mohan Reddy decissions on Districts

జగన్ ఆ నిర్ణయం విని వైకాపా నేతలు గొణుక్కుంటున్నారట...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభించనున్న మహాసంకల్ప పాదయాత్రలో పార్టీ ఏవిధంగా ముందుకు సాగాలన్న దానిపై ఇప్పటికే జగన్ అధ్యక్షతన ఒక సమావేశం కూడా జరిగింది. ఈ కార్యక్రమం

Jagan Mohan Reddy
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభించనున్న మహాసంకల్ప పాదయాత్రలో పార్టీ  ఏవిధంగా ముందుకు సాగాలన్న దానిపై ఇప్పటికే జగన్ అధ్యక్షతన ఒక సమావేశం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.
 
2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా, ప్రశాంత్ కిషోర్ సలహాలతో జగన్ ముందుకు సాగుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ పలు హామీలను ఇచ్చిన విషయం తెలిసిందే. వైసిపి అధికారంలోకి వస్తే ఏపీలో ఇప్పుడున్న 25 పార్లమెంటు నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ప్రకటిస్తానని చెప్పారట. ఈ క్రమంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మార్పులు చేయనున్నారు. 
 
జిల్లా అధ్యక్షస్థానాలను రద్దు చేసి వాటి స్థానాల్లో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన అధ్యక్షులను నియమించనున్నట్లు జగన్ తెలిపారట. జగన్ తీసుకున్న నిర్ణయంపై వైసిపి నాయకులు ఒప్పుకున్నట్లే ఒప్పుకుని బయటకు వచ్చి గొణుగుతున్నారట.
About Writer
TJ
తర్వాతి కథనం
లవర్ కోసం భర్తను చంపాలని విషం కలిపింది... కానీ 14 మంది...