1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Jayalalithaa's thumb impression: PIL against validity dismissed

ఆ వేలి ముద్ర జయలలితతే .. హైకోర్టులో ప్రభుత్వ వైద్యుడు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్న సమయంలో అన్నాడీఎంకే బీఫామ్ పత్రాలపై వేసిన వేలిముద్ర ఆమెదేనని మద్రాస్ హైకోర్టులో ప్రభుత్వం వైద్యుడు ధృవీకరించారు.

Jayalalithaa
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్న సమయంలో అన్నాడీఎంకే బీఫామ్ పత్రాలపై వేసిన వేలిముద్ర ఆమెదేనని మద్రాస్ హైకోర్టులో ప్రభుత్వం వైద్యుడు ధృవీకరించారు. 
 
అనారోగ్యానికిగురై, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తిరుప్పరకుండ్రం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఏకే బోస్ పోటీ చేశారు. అయితే, ఈయన సమర్పించిన బిఫామ్ పత్రంలో జయలలిత వేలి ముద్ర వేశారు. 
 
అన్నాడీఎంకే అభ్యర్థి బోస్ సమర్పించిన బీ-ఫారమ్‌పై డీఎంకే అభ్యర్థి అనుమానాలు వ్యక్తంచేశారు. ఆ బీ-ఫారమ్‌పై ఉన్న వేలిముద్ర మాజీ సీఎం జయలలితది కాదు అని డీఎంకే కేసు వేసింది. జయలలిత జీవించే ఉంటే సంతకం చేయకుండా వేలిముద్ర ఎందుకు వేశారని ఆయన ఆ పిటీషన్‌లో సందేహాన్ని లేవనెత్తారు. 
 
ఈ పిటీషన్‌పై విచారణ సమయంలో హాజరైన ప్రభుత్వ వైద్యుడు పి. బాలాజీ... ఆ వేలి ముద్ర మాజీ సీఎం జయలలితదే అని ధృవీకరించారు. పోలింగ్ డాక్యుమెంట్లపై ఉన్న వేలిముద్రలు జయవే అని ఆయన స్పష్టం చేశారు. బీ-ఫారమ్‌లో ఉన్న వివరాలను చదివిన తర్వాత.. జయనే ఆ వేలిముద్ర వేసినట్లు డాక్టర్ బాలాజీ.. మద్రాస్ హైకోర్టుకు విన్నవించారు. వేలముద్ర వేసిన సమయంలో జయ పక్కన ఆమె స్నేహితురాలు వీకే శశికళ మాత్రమే ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. 2016, అక్టోబర్ 27 సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ వేలిముద్రలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
బాబూ... ఇక ఇక్కడ చాలు... ఇదిగో నా రాజీనామా... రేవంత్ రెడ్డి