లేత కాకర కాయలతో ఫైల్స్‌కు చెక్ పెట్టవచ్చు..
కాకరలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాకర రక్తపోటు, కంటి కమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి చర్మవ్యాధులను దూరం చేస్తుంది. కాకర కాయలో ఆకలిని పెంచే శక్తి పుష్కలంగా వుంది. ఇది ఉదరానికి మంచిది. అధ
కాకరలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కాకర రక్తపోటు, కంటి కమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి చర్మవ్యాధులను దూరం చేస్తుంది. కాకర కాయలో ఆకలిని పెంచే శక్తి పుష్కలంగా వుంది. ఇది ఉదరానికి మంచిది. అధిక రక్తపోటు, కంటి సమస్యలను, నాడీ సంబంధిత ఇబ్బందుల నుంచి దూరం చేస్తుంది.
పిండి పదార్థాలు జీర్ణంలో కలిగే మార్పులను సరిదిద్దుతుంది. కాకరకాయలో విటమిన్ ఏ, బీ1, బీ2, సీ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్ లభిస్తాయి. కాకర రక్త కణజాలాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మధుమేహ వ్యాధి విరుగుడుకు కాకరను వాడుతారు. కాకరలో ఇన్సులిన్ ఉంది. దీని ప్రభావంతో రక్తం, మూత్రంలో చేరిన చక్కెర అధిక నిల్వలు తగ్గుతాయి. ఇందు కోసమైనా కాకరను ఆహారంలో తరుచూ తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్థులు ప్రతిరోజు ఉదయం పరగడుపున కాకర రసం తాగాల. లేత కాకరకాయ ఆకుల పైల్స్‌కి విరుగుడుగా పనిచేస్తుంది. రోజూ ఉదయం మూడు చెంచాల తాజా కాకరకాయ రసాన్ని గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగాలి. ఇలా నెల రోజులు చేస్తే మొలలు తగ్గుతాయి.