1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Dry Ginger powder Health benefits

శొంఠి ఇంట్లో వుంటే.. ఎంతో మేలు

వర్షాకాలం శొంఠి ఇంట్లో వుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో తరచూ తడవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలు

Dry Ginger powder
వర్షాకాలం శొంఠి ఇంట్లో వుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో తరచూ తడవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపినా ప్రయోజనం ఉంటుంది.  
 
జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే శొంఠి పొడికి చిటికెడు బెల్లం ముక్క కలిపి రోజూ రెండు మూడు సార్లు తినాలి. అలాగే చెంచా శొంఠి పొడికి చిటికెడు లవంగాల పొడి, ఉప్పు ఒకటిన్నర కప్పు నీటిలో వేసి మరగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబును నివారించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
వేడి అన్నంలో శొంఠి పొడిని, పప్పునూనెను కలిపి ప్రతీ రోజూ మొదటి ముద్దగా తింటే అజీర్తి పోయి ఆకలి పెరుగుతుంది. అలాగే పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి, అరచెంచా తేనె కలిపి తాగితే కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాదు, బరువూ అదుపులో ఉంటుంది. శొంఠి, మిరియాలు, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకుని కషాయం తయారు చేయాలి. దానికి చక్కెర కలిపి వేడిగా తాగితే ముక్కు దిబ్బడ, జలుబు వంటివి తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
About Writer
selvi
తర్వాతి కథనం
గుండెజబ్బుతో బాధపడేవారు.. రోజూ జామపండును తీసుకుంటే?