మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (11:11 IST)

మునగాకు రసాన్ని నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాసుకుంటే..?

మునగాకు రసాన్ని, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ప్రతి రోజూ ఉదయం రాసుకుంటే మొటిమలను దూరం చేసుకోవచ్చు. సౌందర్యం పెరుగుతుంది. మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి,

మునగాకు రసాన్ని, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ప్రతి రోజూ ఉదయం రాసుకుంటే మొటిమలను దూరం చేసుకోవచ్చు. సౌందర్యం పెరుగుతుంది. మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి ఆరోగ్యాన్ని పెంచుతుంది. మునగాకు కాడ నుంచి తీసిన రసాన్ని గాయాలకు రాస్తే యాంటి సెప్టిక్‌గా గాయాలను నయం చేస్తుంది. ఒక చెంచా మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి, రోజూ నిద్రపోయే సమయంలో తాగితే రేచీకటి తగ్గిపోతుంది.
 
మునగాకు నూరి ఆ ముద్దను కురుపులపై కడితే అవి నయం అవుతాయి. చిన్న దెబ్బలకు, బెణుకులకు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మునగాకు రసం, ఉప్పు కలిపిన రసం కొద్దిగా సేవిస్తూ ఉంటే అజీర్ణం తగ్గిపోతుంది. మునగాకును పాలలో కాసి కాగపెట్టి, ఆ పాలను తాగుతూ ఉంటే వీర్యవృద్ధి కలుగుతుంది.
 
మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా తాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది. మునగాకు రసంలో కొంచెం నిమ్మరసం వేసి తాగితే ఆకలి పుడుతుంది. మునగాకులో ప్రోటీన్లు, విటమిన్లు, మాంసపుకృతులు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.