బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 జులై 2017 (16:26 IST)

వాల్‌నట్స్‌ను తేనెలో నానబెట్టి తీసుకుంటే?

వాల్‌నట్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. వీటిని తేనెలో నానెబెట్టి తీసుకోవడం ద్వారా అల్సర్‌ను దూరం చేసుకోవచ్చు. వాల్ నట్స్‌లో ఖనిజాలు, కార్బొహైడ్రేడ్లు, గుడ్ కొలెస్ట్రాల్, ప్రోటీన్లు పు

వాల్‌నట్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. వీటిని తేనెలో నానెబెట్టి తీసుకోవడం ద్వారా అల్సర్‌ను దూరం చేసుకోవచ్చు. వాల్ నట్స్‌లో ఖనిజాలు, కార్బొహైడ్రేడ్లు, గుడ్ కొలెస్ట్రాల్, ప్రోటీన్లు పుష్కలంగా వున్నాయి. అరకేజీ వాల్ నట్స్‌లో అరకేజీ తేనె ఒక నిమ్మకాయ రసాన్ని చేర్చి సీసాలో భద్రపరుచుకోవాలి. ఇలా భద్రపరుచుకున్న వాల్‌నట్స్ తేనె మిశ్రమాన్ని రోజుకో స్పూన్ లెక్కన మూడుపుటలా తీసుకుంటే.. రక్త హీనత దూరమవుతుంది. 
 
హైబీపీ వున్నవారు వంద గ్రాముల వాల్‌నట్స్, 100 గ్రాముల తేనెను కలిపి.. వాటిని 45 రోజుల పాటు రోజూ రెండు స్పూన్ల లెక్కన తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే అల్సర్‌ను దూరం చేసుకోవాలన్నా తేనెలో నానబెట్టిన వాల్‌నట్స్ తీసుకోవాల్సిందే. 
 
కడుపులో మంటగా వున్నట్లైతే.. 20 గ్రాముల వాల్ నట్స్‌ను వేడినీటిలో బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి రెండు స్పూన్ల తేనె కలిపి.. ఆహారానికి తీసుకునేందుకు అరగంట ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సంతానలేమిని దూరం చేసుకోవాలంటే.. వాల్‌నట్స్, తేనెను సమపాళ్లలో నానబెట్టి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.