ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2017 (10:18 IST)

తలనొప్పి పోవాలంటే మునగాకు తినండి..

తలనొప్పి, నోటిపూత పోవాలంటే వారానికి నాలుగు రోజులు మునగాకు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దంత సమస్యలు తగ్గాలంటే.. జుట్టు బాగా పెరగాలంటే.. జుట్టు తెల్లబడకుండా వుండావలంటే, చర్మవ్యాధులు రా

తలనొప్పి, నోటిపూత పోవాలంటే వారానికి నాలుగు రోజులు మునగాకు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దంత సమస్యలు తగ్గాలంటే.. జుట్టు బాగా పెరగాలంటే.. జుట్టు తెల్లబడకుండా వుండావలంటే, చర్మవ్యాధులు రాకుండా వుండాలంటే కచ్చితంగా రోజువారీ డైట్‌లో అరకప్పు మునగాకు వుండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మునగాకును నేతిలో వేయించి తీసుకోవడం ద్వారా రక్తహీనత దూరమవుతుంది. 
 
మునగాకు, మిరియాలు చేర్చి రెండు గ్లాసుల నీటిలో మరిగించి రసం పెట్టుకుని తాగితే, చేతులు, కాళ్ళ నొప్పులు మాయమవుతాయి. మునక్కాయ ఉదర సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. వారంలో రెండుసార్లు మునక్కాయను తీసుకుంటే శరీరంలోని రక్తం, యూరిన్ శుభ్రమవుతుంది. ఆస్తమా, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేసుకోవాలంటే మునగాకు సూప్‌ను తాగాలి. స్త్రీ, పురుషుల్లో సంతానలేమి సమస్యను దూరం చేసుకోవాలంటే... మునగాకును డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.