మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (11:10 IST)

జుట్టు జిడ్డుగా వుంటే గ్రీన్ టీ బ్యాగులను ఇలా ఉపయోగించండి..?

జుట్టు జిడ్డుగా వుంటే.. కలబందను ఉపయోగించండి. కలబంద జుట్టుకు తేమను అందిస్తుంది. ఇది అదనంగా పేరుకుపోయిన జిడ్డును కూడా తొలగిస్తుంది. పావు కప్పు కలబంద గుజ్జులో కొన్ని చుక్కల నువ్వుల నూనెను కలపాలి. ఈ మిశ్ర

జుట్టు జిడ్డుగా వుంటే.. కలబందను ఉపయోగించండి. కలబంద జుట్టుకు తేమను అందిస్తుంది. ఇది అదనంగా పేరుకుపోయిన జిడ్డును కూడా తొలగిస్తుంది. పావు కప్పు కలబంద గుజ్జులో కొన్ని చుక్కల నువ్వుల నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసి మర్దన చేయాలి. 20 నిమిషాలయ్యాక కడిగేయాలి.

అలాగే రెండు నిమ్మకాయల రసాన్ని ఒక కప్పు నీటిలో కలపాలి. దీన్ని మాడు మొదలు తలంతా పట్టించి.. నెమ్మదిగా మర్దన చేయాలి. పది నిమిషాలయ్యాక గోరువెచ్చని నీళ్లత కడిగేయాలి. ఇలా చేస్తే జిడ్డు పోవడమే కాకుండా.. జుట్టు పట్టులా కనిపిస్తుంది. అలాగే వెనిగర్‌‌ను కూడా రాసుకోవచ్చు. 
 
అలాగే జిడ్డుగా వున్న జుట్టుకు పావుకప్పు వంటసోడాకు నీళ్లు కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టిది 15 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేయాలి. అంతేగాకుండా బ్లాక్ టీ, గ్రీన్ టీ బ్యాగులను వేడి నీటిలో మూడు నిమిషాల పాటు వుంచాలి.

ఈ మిశ్రమం చల్లారాక కప్పు చల్లటి నీటిలో కలపాలి. ఈ నీటిని తలపై ధారలా పోయాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. జిడ్డుపోయి జుట్టు పట్టులా మారుతుంది.