మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2017 (16:45 IST)

కలబంద జ్యూస్ తాగండి.. బరువు తగ్గండి..

బరువు తగ్గాలనుకునేవారు కలబంద గుజ్జుతో తయారయ్యే జ్యూస్ తాగండి. దీనికి ఫ్యాట్‌ను కరిగించే సామర్థ్యం వుంది. కలబంద జ్యూస్‌లో ఫైటోస్టెరోల్స్‌, విసిరల్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉన్నాయి. శరీరంలోపల అవయవాలచుట్టూ ఏర్

బరువు తగ్గాలనుకునేవారు కలబంద గుజ్జుతో తయారయ్యే జ్యూస్ తాగండి. దీనికి ఫ్యాట్‌ను కరిగించే సామర్థ్యం వుంది. కలబంద జ్యూస్‌లో ఫైటోస్టెరోల్స్‌, విసిరల్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉన్నాయి. శరీరంలోపల అవయవాలచుట్టూ ఏర్పడిన కొవ్వును కరిగించడంలో కలబంద సహాయపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ అలోవెర జ్యూస్‌ను రెగ్యులర్‌ డైట్‌‌లో చేర్చుకోవడం వల్ల స్లిమ్‌గా తయారు కావచ్చు.
 
అల్లం శరీర బరువు తగ్గించే అద్భుతమైన ఔషదం. ఒక కప్పు నీటిని తీసుకొని దాంట్లో చెంచా కలబంద రసం, ఒక చెంచా అల్లం తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద ఎక్కువ సమయం మరిగించాలి. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే స్లిమ్‌గా, అందంగా కనిపిస్తారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.