మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (14:45 IST)

రోజువారీ డైట్‌లో నట్స్ చేర్చుకుంటే.. ఒబిసిటీ మటాష్

రోజువారీ డైట్‌లో వాల్‌నట్స్, బాదం, వేరుశెనగలు వంటివి తీసుకుంటే ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. అధిక బరువు సమస్య ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న నేపథ్యంలో పండ్లతో పాటు నట్స్‌ను ర

రోజువారీ డైట్‌లో వాల్‌నట్స్, బాదం, వేరుశెనగలు వంటివి తీసుకుంటే ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. అధిక బరువు సమస్య ప్రస్తుతం అనేకమందిని వేధిస్తున్న నేపథ్యంలో పండ్లతో పాటు నట్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గుతారని పరిశోధకులు అంటున్నారు. వీటిని రోజూ తీసుకోవడం ద్వారా అధిక బరువుతో ఏర్పడే అనారోగ్య సమస్యలు దూరమైనట్లు తేలింది. 
 
అంతేగాకుండా నట్స్ చాలామందిలో బరువును కూడా తగ్గించాయని పరిశోధనలో తేలింది. సాధారణంగా నట్స్‌ను అధిక కొవ్వుతో కూడిన పదార్థాలని పక్కనబెడుతుంటారు. అయితే నట్స్ ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధకులు తేల్చారు. 
 
నట్స్‌ను గుప్పెడు రోజూ  తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి, మంచి కొలెస్ట్రాల్, ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్, పైటోకెమికల్స్ వంటివి లభిస్తాయి. వృద్ధుల్లో మతిమరుపును కూడా నట్స్ దూరం చేస్తాయి. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి.