గురువారం, 12 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2017 (16:06 IST)

బరువు తగ్గాలంటే.. నారింజ పండును రోజూ తినండి

బరువు తగ్గాలంటే.. గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ పాలీ ఫినాల్స్‌లను కలిగి ఉండి శరీరంలో ట్రై-గ్లిసరైడ్స్‌లను విచ్ఛిన్నపరుస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు చేయడం ద్వారా బరువు తగ్గటానికి కావలసిన సహనాన్ని పెంచు

బరువు తగ్గాలంటే.. గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ పాలీ ఫినాల్స్‌లను కలిగి ఉండి శరీరంలో ట్రై-గ్లిసరైడ్స్‌లను విచ్ఛిన్నపరుస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు చేయడం ద్వారా బరువు తగ్గటానికి కావలసిన సహనాన్ని పెంచుతుంది.

అలాగే బ్రొకలీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేసే గుణాలను కలిగి ఉంటుంది. అంతేగాకుండా ఎక్కువ మొత్తంలో ఫైబర్ స్థాయులను కలిగి వుండి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. ఆహారంలో అధిక కెలోరీలు, కొవ్వులను అందించే ఆహారాలకు బదులుగా బ్రొకలీని కలుపుకోవాలి.  
 
బరువు తగ్గించడంలో సహాయపడే మరొక అద్భుతమైన ఆహారంగా నారింజ పండును తినాలి. ఎక్కువ కేలోరీలను అందించే వంటకాలకి బదులుగా నారింజ పండ్లను తినటం మంచిది. నారింజ పండులో అధిక మొత్తంలో ఫైబర్ విటమిన్ 'సి'లను కలిగి ఉండి, జీవక్రియ రేటును పెంచి ఆకలి అనిపించకుండానే శరీర బరువు తగ్గిస్తాయి. 
 
క్యాబేజీని మీ ఆహర ప్రణాళికలో కలుపుకోవటం వలన ఆకలి తగ్గుతుంది. శరీర అధిక బరువును తగ్గించటంలో సహాయపడటమే కాకుండా, అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్'లను, విటమిన్ 'సి' కలిగి ఉండి, జీవక్రియ రేటును మెరుగుపరచి, శరీర రోగనిరోధక వ్యవస్థ శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.