బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By tj
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2017 (15:07 IST)

వృధ్ధాప్యం రాకూడదంటే ఒక్కటే దారి....!

స్వీట్ కార్న్‌ను ప్రతిరోజు తగినంతగా తింటే కొన్ని రకాల క్యాన్సర్లే కాదు వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించవని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో తక్కువ క్యాలరీలు, అధిక మొత్తంలో పీచు, విటమిన్, యాంటీ ఆక్సిన్‌లు ఉం

స్వీట్ కార్న్‌ను ప్రతిరోజు తగినంతగా తింటే కొన్ని రకాల క్యాన్సర్లే కాదు వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించవని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో తక్కువ క్యాలరీలు, అధిక మొత్తంలో పీచు, విటమిన్, యాంటీ ఆక్సిన్‌లు ఉంటాయి. కాబట్టి వీటిని తింటే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణుల పరిశోధనలో తేలింది. అంతేకాదు శరీరం కూడా కాంతివంతమవుతుంది. అలాగే జుట్టు కూడా పెరుగుతుంది. శరీరంలో రక్తప్రసరణ సాగడం వల్ల శిరోజాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 
 
వయస్సు పెరిగే కొద్దీ కంటి చూపు మందగించడమే కాదు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. వాటి దుష్ప్రభావాలను తగ్గించడం వల్ల స్వీట్‌కార్న్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని జియాజాక్సిన్ అనే ప్రత్యేకమైన యాంటియాక్సిన్ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుందట. గుండె సంబంధిత వ్యాధులను అడ్డుకుంటుంది. 
 
ప్రతిరోజు మన శరీరానికి 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. కనీసం 20 గ్రాములన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. స్వీట్‌కార్న్ తీసుకోవడం వల్ల ఈ ఫైబర్ అందులో తోడవుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇందులో పోలిక్ యాసిడ్, ఐరన్, ఎనీమియాలను దూరం చేస్తాయట. యాపిల్‌తో పోలిస్తే ఇందులో చక్కెర శాతం కూడా చాలా తక్కువేనట. మోతాదు మించకుండా స్వీట్‌కార్న్‌లను తీసుకోవచ్చట. ఆపిల్‌లో ఉన్న పోషకాలలాగా స్వీట్‌కార్న్‌లో కూడా అవే పోషకాలు ఉంటాయి.