శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 17 ఆగస్టు 2017 (20:30 IST)

దాల్చినచెక్క పొడితో పుష్టిగా వృద్ధి...

మంచి సువాసనతో కాస్తంత వగరుగా, తియ్యంగా ఘాటుగా వుండే దాల్చిన చెక్క మషాలా దినుసులలో అతి ముఖ్యమైనది దాల్చిన చెక్క. దీనిని పూర్వం నుండి వంటింట్లో వాడుతున్నారు. మసాలా దినుసులలోనే కాక వైద్యంలో కూడా ఉపయోగిస్తాం. అజీర్తిని తగ్గించే గుణం దాల్చిన చెక్కకు వుంది

మంచి సువాసనతో కాస్తంత వగరుగా, తియ్యంగా ఘాటుగా వుండే దాల్చిన చెక్క మషాలా దినుసులలో అతి ముఖ్యమైనది దాల్చిన చెక్క. దీనిని పూర్వం నుండి వంటింట్లో వాడుతున్నారు. మసాలా దినుసులలోనే కాక వైద్యంలో కూడా ఉపయోగిస్తాం. అజీర్తిని తగ్గించే గుణం దాల్చిన చెక్కకు వుంది. దీనిని కేవలం కూరలలో మాత్రమే కాక మెత్తగా దంచి ఆ పొడిని నీటిలో కలుపుకొని త్రాగడం వల్ల కూడా ఫలితాన్ని పొందవచ్చు. 
 
వాత వ్యాధులలో దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది. వాత వ్యాధులలో కలిగే నొప్పిని ఇది వెంటనే నివారిస్తుంది. గొంతులో గురగురను పోగొట్టి గొంతును శ్రావ్యంగా వుంచుతుంది. స్వరం బొంగురుగా వచ్చి, స్వరపేటిక వాపు వున్నప్పుడు దాల్చిన చెక్కను బుగ్గన పెట్టుకొని అప్పుడప్పుడు వచ్చిన ఊటను మింగుతూ వుండాలి.
 
స్త్రీలకు ఇది అద్బుతమైన ఔషధం. ఋతుశూల అనేది ఎంతోమందికి నరకప్రాయం. దీనిని దాల్చినచెక్క వాడటం ద్వారా తగ్గించవచ్చు. స్త్రీల ఋతు సమస్యలనే కాకుండా గర్భాశయ దోషాల్ని కూడ అరికడుతుంది. గర్భిణీ స్త్రీ దీన్ని వాడితే సుఖప్రసవం అవుతుంది. కంటి రోగాలతో బాధపడేవారు దాల్చిన చెక్కను వాడితే కళ్ళు కాంతివంతమవుతాయి. పావుసేరు గుమ్మపాలలో రెండు చెంచాల దాల్చినచెక్క పొడిని కలిపి రోజూ త్రాగితే వీర్యవృద్ధి కలుగుతుంది. దీనికి వేడిచేసే గుణంకలదు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
 
శరీరానికి నీరు పట్టినవారు దాల్చనచెక్కను ప్రతిరోజు క్రమంతప్పకుండా వాడితే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది. హృద్రోగాలలో దీనివంతు సాయం గుండెకు బలంగా వుంటుంది. కల్తీ తినుబండారాలు తినడం వలన కలిగే విష దోషాల నుండి రక్షించే దివ్యమైన ఔషధం దాల్చిన చెక్క. ఎలర్జీ కలుగు పదార్థాల్ని తిన్నా దాని తీవ్రతను తగ్గించడానికి దాల్చిన చెక్క పొడినిగాని, రసాన్నిగాని తీసుకోవాలి.