శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2017 (13:40 IST)

బ్లాక్ టీని పరగడుపున తాగుతున్నారా... డేంజరే..

ఒక రోజుకు నాలుగు కప్పుల కంటే అధికంగా బ్లాక్ టీ తాగకూడదు. అధికంగా బ్లాక్ టీ తాగితే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. పరగడుపున బ్లాక్ టీ తాగితే.. కడుపులో మంట... తద్వారా అసిడిటీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అ

ఒక రోజుకు నాలుగు కప్పుల కంటే అధికంగా బ్లాక్ టీ తాగకూడదు. అధికంగా బ్లాక్ టీ తాగితే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. పరగడుపున బ్లాక్ టీ తాగితే.. కడుపులో మంట... తద్వారా అసిడిటీ ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే బ్లాక్ టీని రోజుకు రెండు కప్పుల మేర తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు మధుమేహం, రక్తపోటును నియంత్రిస్తాయి. 
 
నోటి క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. బ్లాక్ టీలో కెఫైన్ తక్కువ శాతం ఉండటంతో మెదడుకు చేరే రక్తప్రసరణ అధికమవుతోంది. ఇంకా శ్వాససమస్యలు, కిడ్నీ సమస్యలు, హృద్రోగ రోగాలు నయం అవుతాయి. బ్లాక్ టీలో వ్యాధినిరోధక శక్తి అధికంగా వుంది. ఇందులోని అమినో యాసిడ్లు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇంకా మానసిక ప్రశాంతతకు తోడ్పడతాయి.