శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: మంగళవారం, 22 ఆగస్టు 2017 (20:49 IST)

ఆ సమస్య వున్నవారు రెండు గంటలకోసారి తులసి ఆకులను నమిలితే...

భారతీయులకు పవిత్రమైన చెట్టు తులసి ముఖ్యంగా హిందువులకు పూజనీయమైన చెట్టు ఇది. తులసి లోని ఔషధగుణాలు కోకొల్లలు. తులసి అనేక రకాలు ఉంటుంది. ఊదా రంగు కాండము, నీల ఛాయగల లేత ఎరుపు పూలను పూసే చెట్టును కృష్ణ తులసి అని అంటారు. లేత ఆకుపచ్చ కాండము తెల్లని పూలను పూ

భారతీయులకు పవిత్రమైన చెట్టు తులసి ముఖ్యంగా హిందువులకు పూజనీయమైన చెట్టు ఇది. తులసి లోని ఔషధగుణాలు కోకొల్లలు. తులసి అనేక రకాలు ఉంటుంది. ఊదా రంగు కాండము, నీల ఛాయగల లేత ఎరుపు పూలను పూసే చెట్టును కృష్ణ తులసి అని అంటారు. లేత ఆకుపచ్చ కాండము తెల్లని పూలను పూసే తులసిచెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తూ వుంటారు. 
 
తులసి రకాల్లో దేన్నైనా సరే రెండు లేక మూడు ఆకుల్ని నమిలి తింటూ వుంటే బ్రాంకైటిస్ వ్యాధి తగ్గుతుంది. సమస్య వున్నప్పుడు ఈ విధంగా ప్రతి రెండు గంటలకు తింటు వుండాలి. తులసికి కడుపులోని క్రిములను పారద్రోలే శక్తి వుంది దీనిని వాడటం వలన రక్తహీనత కూడా నివారించబడుతుంది. తులసి ఆకులకు నాలుగు మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకొని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడ జీర్ణమవుతుంది. 
 
జీర్ణ శక్తికి ఇది మంచి మందు. ఉబ్బసాన్ని నివారించడంలో తులసి ముఖ్యమైన ఔషధం. ఉబ్బసం ఉన్నవారు తరుచు తులసి కషాయం తీసుకుంటే కొన్నాళ్ళకు ఉబ్బసం రాదు. తులసి జ్వరహారిణి, సాధారణ జ్వరాలు ఏవి వచ్చినా తులసి ఆకులతో కషాయం కాచి తాగితే తగ్గిపోతుంది. అంతేకాదు టైఫాయిడ్ జ్వరములో తులసి చెట్టు కాండమును బాగా దంచి కషాయం కాచి ప్రతిపూట త్రాగుతుంటే జ్వరం నెమ్మదిస్తుంది. 
 
అవసాన దశలో వున్న మనిషికి తలసి తీర్థంపోయడంలో వారి గొంతులో కఫం ఏవైనా అడ్డుపడకుండా శ్వాస సరిగ్గా తీసుకుంటారని ఆవిధంగా చేస్తారు. అందుకే తులసి సర్వ రోగనివారణి.