శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (09:31 IST)

సూప్స్ తాగితే మేలెంత?

సూప్స్‌ తాగడం ద్వారా బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భోజనానికి ముందు సూప్స్ తాగడం ద్వారా శరీరంలో కొవ్వుశాతం తగ్గుతుంది. శరీరాకృతి అందంగా మారాలంటే రోజూ సూప్స్ తాగడం మంచిది. దీ

సూప్స్‌ తాగడం ద్వారా బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా భోజనానికి ముందు సూప్స్ తాగడం ద్వారా శరీరంలో కొవ్వుశాతం తగ్గుతుంది. శరీరాకృతి అందంగా మారాలంటే రోజూ సూప్స్ తాగడం మంచిది. దీనివల్ల మితాహారం తీసుకోవడం అలవాటవుతుంది. శరీరంలో ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. అలాగే శరీరంలో వ్యర్థాలని బయటకు పంపించడంలో సూప్స్ బాగా పనిచేస్తాయి. 
 
అందుకే రోజువారీ డైట్‌లో సూప్స్‌, సలాడ్స్‌, తాజా పండ్లరసాలూ, కాయగూరలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ఉప్పూ, పంచదార, నూనెలని మితంగా ఉపయోగించాలి. అంతేగాకుండా రోజులో రెండు నుంచి మూడుసార్లు గ్రీన్ టీ తాగితే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతంది. జీర్ణప్రక్రియ వేగవంతం అవుతుంది. శరీరం ఉల్లాసభరితంగా ఉండేందుకు గ్రీన్ టీ తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.