1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Liquor Shops Closed in Vizainagaram District

సిరిమాను ఉత్సవాలు : ఏపీలో మద్యం దుకాణాలు మూసివేత

Sirimanu Festival
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 18, 19వ తేదీల్లో విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న, సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులను కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. 
 
ఈ మేరకు శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్సవాలు జరిగే రెండు రోజుల్లో కార్పొరేషన్‌ పరిధిలోని ఉన్న, నగరానికి సమీపంలో గల మద్యం దుకాణాలు, బార్లు, కళ్లు దుకాణాలు తెరవరాదని సూచించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
ఈ రెండు రోజుల పాటు సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలని, నిబంధనలు అమలు చేయాలని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘించి మద్యం దుకాణాలు లేదా బార్లను తెరిచివుంచే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమ ఆదేశాల్లో స్పష్టం చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మారుస్తాం : పవన్ కళ్యాణ్