గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:25 IST)

కృష్ణా జిల్లాలో రేపు మద్యం దుకాణాలు మూసివేత

ఈ నెల 19వ తేదీ ఆదివారం  రాష్ట్రంలో ఎంపీటీసీ , జెడ్పిటిసి ఎన్నికల వోటింగ్ చేపట్టనున్న దృష్ట్యా  రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ననుసరించి  19 తేదీన  జిల్లాలో  మద్యం దుకాణాలు మూసి వేయాలని, మద్యం అమ్మకాలపై నిషేధాన్ని పక్కాగా అమలు  చేయాలనీ కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. 

ఈ మేరకు ప్రకటన విడుదల చేసారు. సెప్టెంబర్  19వ తేదీలలో  మద్యం దుకాణాలు మూసివేయడంతో, మద్యం అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవడం, మద్యం అక్రమ రవాణా జరగకుండా పక్క నిఘా ఏర్పాటు చేయాలన్నారు.  మద్యం నిల్వ చేయడం కూడా నేరమన్నారు. 

జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా నోడల్  అధికారిని నియమించడం జరిగిందన్నారు.  సదరు అధికారి క్షేత్ర స్థాయిలోని అధికారుల సమన్వయంతో కౌంటింగ్ రోజున  మద్యం అమ్మకాలు, నిల్వ, అక్రమ మద్యం అమ్మకాలపై నియంత్రణ పర్యవేక్షిస్తారన్నారు.