1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Lok Satta Jayaprakash Narayan surajya yatra

దాని కోసం 45 యేళ్ళుగా ప్రయత్నిస్తున్నా - లోక్ సత్తా జయప్రకాష్‌ నారాయణ్

రాజకీయ లబ్ది కోసం తాను సురాజ్య యాత్ర చేపట్టలేదన్నారు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ్. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లోక్ సత్తా పార్టీ నేతలు యాత్ర చేపట్టారని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారాయన.

Lok Satta

ప్రభుత్వ కార్యాలయాల్లో పక్కాగా పౌర సేవలు అందడం, విద్యావ్యవస్థను మెరుగుపరచడం, పేదవాడి జేబు నుంచి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం, నేరం చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష, తమ పనులు చేసుకునే అధికారం ప్రజలకే అప్పజెప్పడం, వ్యవసాయంలో ఆదాయం పెంచడం వీటి కోసమే తాను సురాజ్య యాత్ర చేపట్టినట్లు జయప్రకాష్‌ నారాయణన్ చెప్పారు. సమాజంలో మార్పు కోసమే తాను 45 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు జయప్రకాష్‌ నారాయణన్ చెప్పారు.
తర్వాతి కథనం
జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఎలా చేస్తారో చూస్తాం... ఎవరు?