శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (13:07 IST)

ప్రజాస్వామ్యానికి పవన్‌లాంటోడు కావాలి : జయప్రకాశ్

ప్రజాస్వామ్య దేశానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లాంటోడు ఒక్కడు కావాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రజాసమస్యలపై పోరాడే నాయుకులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య దేశానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లాంటోడు ఒక్కడు కావాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రజాసమస్యలపై పోరాడే నాయుకులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఉద్దానం కిడ్నీ బాధితుల‌వంటి సమస్యలపై పవన్ పోరాడటాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో మీడియాతో ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకే రిజర్వేషన్లు తెచ్చారని, అంతేగానీ కులానికి కాదని అభిప్రాయపడ్డారు. ఈ దేశంలో కులాలను కూకటివేళ్ళతో పెకలించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
ఏపీలో కుల కార్చిచ్చు పెరిగిందన్నారు. రిజర్వేషన్లను స్వార్థ రాజకీయాలకోసం వినియోగించకుండా ఉంటే సమస్యే ఉండదు అన్నారాయన. పట్టిసీమ అనుసంధానంతో రాయలసీమ రైతులకు మేలు జరిగిందని, పోలవరం ప్రాజెక్టు విషయంలో రైతులకు సకాలంలో పరిహారం అందిందని ఆయన పేర్కొన్నారు.