1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Malladi Vishnu sworn in

మల్లాది విష్ణు పదవీ ప్రమాణ స్వీకారం

Malladi Vishnu
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీవారి ఆలయంలోని జయవిజయుల వద్ద అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి ఉదయం 7 గంటలకు మల్లాది విష్ణుతో ప్రమాణం చేయించారు. అనంతరం అధికారులు ఆయనకు స్వామివారి దర్శనం చేయించారు.

రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వాదం చేశారు. ధర్మారెడ్డి ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందించారు.
 
సిఎం కు కృతజ్ఞతలు
టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా తనను నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
తర్వాతి కథనం
మైనర్ బాలికపై అత్యాచారం.. ఇద్దరు వ్యక్తులు కలిసి..?