మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (12:31 IST)

తెలంగాణ సీజేగా జస్టిస్‌ హిమా కోహ్లి ప్రమాణం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై జస్టిస్‌ హిమా కోహ్లితో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాష్ట్ర మంత్రులు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు హాజరయ్యారు.

ఇంతకు ముందు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఆర్‌.ఎస్‌ చౌహాన్‌ ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా.. జస్టిస్‌ హిమా కోహ్లి తెలంగాణ హైకోర్టుకు ప్రథమ మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడం విశేషం.