22న రాజ్యసభ ఎంపీలు ప్రమాణ స్వీకారం
దేశంలో ఇటీవలి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన నూతన ఎంపీలు ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా వైరస్ కారణంగా భౌతిక దూరం నిబంధనలు కొనసాగిస్తూ రాజ్యసభ చైర్మన్ ఛాంబర్‌లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
పార్లమెంట్ చరిత్రలో ఇంటర్ సెషన్ సమయంలో చైర్మన్ ఛాంబర్‌లో సభ్యుల ప్రమాణ స్వీకారం జరగడం ఇదే తొలిసారి. రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సాధారణంగా సభలో జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు చైర్మన్ ఛాంబర్‌లో జరుగుతుంది.
కానీ ఇప్పుడు ఇంటర్ సెషన్ సమయం. ఇటీవలి 20 రాష్ట్రాల నుంచి 61 మంది రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవగౌడ, కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే, బిజెపి యువనేత జ్యోతి రాధిత్య సింథియా, జెఎంఎం అధినేత సిబూ సోరెన్ తదితరులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.