మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (21:37 IST)

నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టండి: ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

విజ‌య‌వాడ‌లోని సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఆయా డివిజ‌న్ల ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌ను కోరారు.

ఈ మేర‌కు ఆయ‌న బుధ‌వారం క‌మిష‌న‌ర్‌తో పాటు అధికారులతో కలసి కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సమావేశమై నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన మరియు పూర్తి చేయాల్సిన అభివృద్ది పనులతో పాటుగా ప్రజలకు అందించు అభివృద్ది సంక్షేమ పధకములపై చర్చించారు.

ఈ సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ల ప్రజలు ఎదుర్కొనుచున్న సమస్యలపై తన దృష్టికి వచ్చిన అంశాలను కమిషనర్‌కి వివరిస్తూ, జె.ఎన్.ఎన్.యు.ఆర్.యం పధకం ద్వారా నిర్మాణంలో ఉన్న గృహసముదాయాలకు వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని తెలిపిన దానిపై సంబందిత అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తూ, సత్వరమే గృహాలకు కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖాధికారులకు సూచించారు.

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించు అనేక సంక్షేమ పధకములు అన్ని అర్హులైన వారికి చెరువ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ కారణాల వల్ల నిలిచిన పెన్షన్ దారులకు ఎదురౌతున్న సమస్యలను వివరిస్తూ, వాటిని పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరు పెన్షన్ పొందే విధంగా చూడాలని సూచించారు.

వై.ఎస్.ఆర్ చేయూత పధకమునకు సంబందించి అర్హులైన ప్రతి ఒక్కరికి  లబ్ది చేకురేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పధకములు అర్హులైన వారoదరికి అందేలా చూడాలని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలను కల్పించేలనే దిశగా ఏర్పాటు చేసిన సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ యొక్క విధులు సమర్ధవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఈ సందర్భంలో డివిజన్ల పరిధిలో ఎదురౌతున్న చిన్న చిన్న సమస్యలు లేదా ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశిలించి వాటిని త్వరితగతిన పరిష్కారించుటకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సమావేశంలో చీఫ్ ఇంజనీర్ మరియన్న, సిటీ ప్లానర్ లక్ష్మణరావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్) శారదాదేవి, చీఫ్ మెడికల్ ఆఫీసర్  డా.గీత భాయి, ప్రాజెక్ట్ ఆఫీసర్ డా.జె.అరుణ, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) వెంకటలక్ష్మి, ఎస్టేట్ ఆఫీసర్ డా. ఏ.శ్రీధర్, ఎ.డి.హెచ్ జ్యోతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.ఎస్.ఎన్ ప్రసాద్  మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.