మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (20:08 IST)

శ్రీవారి సేవలో మేకపాటి దంపతులు

మంత్రి మేకపాటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వీఐపీ బ్రేక్ దర్శనంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని  దర్శించుకున్నారు. బుధవారం ఆయన సతీసమేతంగా వెళ్లి  శ్రీవారిని సందర్శించారు.

ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మేకపాటి మీడియాతో మాట్లాడుతూ.. వేకువజామునే కుటుంబ సమేతంగా తనకు స్వామివారి దర్శనభాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శ్రీవారి దర్శనంతో మనసు నిర్మలంగా ప్రశాంతతో నిండిపోయిందన్నారు.

కోవిడ్-19 ప్రభావం పూర్తిగా తగ్గిపోయి రాష్ట్ర ప్రజలు అంతకు ముందులాగే సాధారణ, స్వేచ్ఛజీవితం పొందాలని స్వామిని కోరుకున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

శ్రీవారి దర్శనంలో మంత్రి మేకపాటితో పాటు ఆయన సతీమణి శ్రీకీర్తి, కుమార్తె కూడా ఉన్నారు. మంగళవారం సాయంత్రం కూడా ఆయన ప్రత్యేక దర్శన ప్రవేశం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు.