21న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
సూర్యగ్రహణం కారణంగా ఈనెల 21వ తేదీన వేకువజాము నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామని తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో నాలుగు నెలల తర్వాత నిర్వహించిన ఈ డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులనుద్దేశించి మాట్లాడారు.
భక్తుల నుండి అందిన సూచనల మేరకు ఈసారి ప్రయోగాత్మకంగా ఆదివారం ఉదయం 9 నుండి 10 వరకు నిర్వహించామన్నారు. భక్తుల స్పందన బాగుంటే ఇదే విధానం కొనసాగిస్తామన్నారు.