1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 20 జులై 2020 (09:12 IST)

తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు మృతి

తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందారు. గత కొద్దీ రోజుల క్రితం దీక్షితులు కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసమూర్తి దీక్షితులు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు.

పదవీ విరమణ అనంతరం ఆయన తిరుపతిలోనే ఉంటున్నారు. ఏడాదిగా శ్రీవారి కైంకర్యాలకు దూరంగా ఉ​న్నారు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో నాలుగు రోజులకు ముందు స్వీమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు.
 
తిరుమల శ్రీవారి ఆలయ విధులకు పెద్దింటి  వంశీకుల అర్చకులు దూరం కానున్నారు. ఇప్పటికే కరోనా పాజిటివ్ రావడంతో 18మంది అర్చకులు విధులకు దూరమయ్యారు. మరి కొంతమంది అర్చకులు విధులకు దూరం అవుతుండటంతో విధుల కేటాయింపు ఇబ్బందికరంగా మారనుంది.

ఇప్పటికే గోవిందరాజుల స్వామి గుడి నుంచి ఐదుగురు అర్చకులను డెప్యూటేషన్‌పై తిరుమలకు టీటీడీ  కేటాయించింది. ప్రస్తుతం మరికొంత మంది అర్చకులను డెప్యూటేషన్‌పై కేటాయించే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది.