మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (10:45 IST)

ఫార్మాసిటీ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి!

విశాఖ పరవాడ రాంకీ ఫార్మాసిటీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

సాల్వెంట్స్‌ ఫార్మా కంపెనీలోని ట్యాంకు పేలి మంటలు ఎగిసిపడ్డాయి. సాల్వెంట్స్‌ ఫార్మా కంపెనీలో శ్రీణివాస్‌ సీనియర్‌ కెమిస్ట్‌ పని చేస్తున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో నలుగురు సిబ్బంది ఉన్నారు.

తీవ్రంగా గాయపడిన కార్మికుడు మల్లేశ్వరరావును గాజువాక ఆసుపత్రికి తరలించారు. దాదాపు ఐదు గంటలపాటు కష్టపడి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. యాజమాన్యం వైఫల్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

విశాఖ రాంకీ ఫార్మాసిటీలోని ‘విశాఖ సాల్వెంట్స్‌’ సంస్థలో సోమవారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు.

పేలుడుకు గల కారణాలను జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.