కరోనాతో అనంతపురం ట్రాఫిక్ సీఐ మృతి

ananthapuram CI
ఎం| Last Updated: బుధవారం, 15 జులై 2020 (13:15 IST)
అనంతపురం నగరంలో ట్రాఫిక్ సీఐగా నిధులు నిర్వర్తిస్తున్న సీఐ రాజశేఖర్ కరోనా బారినపడి మంగళవారం మృతి చెందారు.

స్థానిక సవేరా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. సీఐ మృతి పట్ల హిందూపురం ఎంపీ గోరంట్ల మాదవ్
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలీకుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాడని ఆయన కితాబిచ్చారు. సీఐ రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.
దీనిపై మరింత చదవండి :