మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 జూన్ 2020 (20:45 IST)

కరోనావైరస్ అడ్డుకునే మందు వచ్చేసింది, మన దేశంలోనే తయారీ

కరోనా మహమ్మారిని తుదముట్టించే వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రపంచానికి శుభవార్త! కరోనా వైరస్ చికిత్సకు మందు వచ్చేసింది. ముంబైకి చెందిన భారత ఫార్మా దిగ్గజ కంపెనీ 'గ్లెన్ మార్క్' 'ఫాబిఫ్లూ టాబ్లెట్' కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
 

ఈ సందర్భంగా గ్లెన్ మార్క్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దన్హా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసిన ఫాబిఫ్లూ బ్రాండ్‌ పేరిట యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ టాబ్లెట్లను  మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

అందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్లు ప్రకటించారు. ఈ డ్రగ్ కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించారు.

ఫ్లూ డ్రగ్ స్థితిగతుల్ని అంచనా వేస్తూ కరోనా వ్యాప్తిని తగ్గిస్తుందని, త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.