1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Solar Eclipse, Tirumala Temple will be closed for 13 hours on December 25th to December 26th

సూర్యగ్రహణం: తిరుమల శ్రీవారి ఆలయం 13 గంటల పాటు మూసివేత

Solar Eclipse
తిరుమల: సూర్యగ్రహణం కారణంగా డిసెంబర్ 25, 26 తేదీల్లో 13 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. 
 
సూర్యగ్రహణం కారణంగా డిసెంబర్ 26 ఉదయం 8.08 గంటల నుంచి ఉదయం 11.16 వరకు ఆలయం మూతపడనున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందు... అంటే డిసెంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. 
 
26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తలుపులు తెరిచి ఆలయ శుద్ధి అనంతరం రెండు గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. 26న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. 
 
గ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సు సైతం మూతపడనుంది.
తర్వాతి కథనం
సూర్యగ్రహణం రోజున చేయాల్సినవి.. చేయకూడనవి? 6 గ్రహాలు ఒకటైతే.. ధనుస్సు రాశికి?