సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2019 (18:52 IST)

సూర్యగ్రహణం రోజున చేయాల్సినవి.. చేయకూడనవి? 6 గ్రహాలు ఒకటైతే.. ధనుస్సు రాశికి?

సూర్యగ్రహణం డిసెంబర్ 26వ తేదీన ఏర్పడుతోంది. ఇది డిసెంబరు 26 గురువారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమై 11.19 వరకు కొనసాగుతుంది. మొత్తం మూడు గంటలా పది నిమిషాల పాటు ఈ గ్రహణం వుంటుంది. గ్రహణం సమయంలో సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది.
 
గ్రహణం సమయంలో భగవన్నామస్మరణ చేయడం ద్వారా ఇంకా భగవంతునిపై మంత్ర శక్తి లక్ష రెట్లు పెరుగుతుంది. గ్రహణం సమయంలో వంట చేయకూడదు. ఆహారం తీసుకోవడం కూడదు. దాంపత్యంలో పాల్గొనకూడదు. ఇంటి కిటికీలను మూసివుంచాలి. సూర్య గ్రహణాన్ని కళ్లతో సూటిగా చూడటం చేయకూడదు. సూర్య గాయత్రి మంత్రాన్ని ఉచ్ఛరించడం మంచిది.  
 
ఇంకా గ్రహణం సమయంలో బియ్యం, ఆహారంలో దర్బను వేసివుంచాలి. దర్బలకు గ్రహణం, అమావాస్య రోజున శక్తి మరింత ఎక్కువ అవుతుంది. అందుకే గ్రహణం సమయంలో వాటిని ఆహారంలో వేసి వుంచుతారు. తద్వారా ఆహారం చెడిపోదని చెప్తుంటారు. గ్రహణానికి ముందు తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గ్రహణానికి గంటకు ముందు, గంటకు తర్వాత మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. 
 
ఇకపోతే.. ఆరు గ్రహాలు ఒకేరాశిలో కలబోతున్నాయి‌. ఒకేసారి ఆరు గ్రహాలు కలుస్తున్నాయ్‌. అదీ ఒకే రాశిలో. ఇది ఆ అరుదు అంటున్నారు శాస్త్రవేత్తలు, జ్యోతిష్య నిపుణులు. రాశులవారీగా చూపించే ప్రభావం ఎంత? గురుడు, శని, కేతువులు ఇప్పటికే ధనుస్సు రాశిలో కలసి ఉన్నాయి‌. దీనికి తోడుగా బుధుడు, రవి, చంద్రుడు వచ్చి కలుస్తున్నాయి. ఈ ఆరు గ్రహాల ఫలితం అనర్ధాలకు దారి తీయదని అంటున్నారు శాస్త్రవేత్తలు. 
 
డిసెంబర్ 25 సాయంత్రం గం.5-30ని.ల నుంచి  27వతేదీ రాత్రి గం.11-40ని.ల వరకు (షష్టగ్రహ కూటమి) రవి, చంద్ర,బుధ, గురు, శని,కేతువులు ధనూరాశిలో ఉంటారు. ధనురాశి ద్వంద్వ రాశి. అగ్ని తత్వరాశి. రాశ్యాధి అధిపతి గురుడు....అందులోనే శని కేతువుల తో కలిసి ఉండడం.. ధనురాశిలోకి రవి సంక్రమణం వల్ల అస్తంగత్వం చెందడం, అదే సమయంలో గండాంత నక్షత్రం మీద సూర్యగ్రహణం ఏర్పడడం కొంత చికాకు, ఆందోళన, ఒత్తిడి కలిగించే అంశమని జ్యోతిష్యులు చెప్తున్నారు.

డిసెంబరు నెలలో  ధనూరాశి లో ఏర్పడే షష్ట గ్రహ ప్రభావం వలన, సూర్యగ్రహణ ప్రభావం వలన అగ్ని తత్వ రాశి అయిన ధనురాశిలో ఈ షష్ట గ్రహ ప్రభావము మన మానసిక శక్తి పరీక్ష లాంటిది. కోరికలను  అదుపులో ఉంచుకుంటే ఈపరీక్ష చక్కగా దాటగలం. అదే సంతులనం కోల్పోతే రానున్న రోజుల్లో తప్పకుండా ఇబ్బందికి గురవుతారు.