శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 జులై 2020 (10:20 IST)

బైపాస్ రోడ్ ద్వారానే ప్రైవేటు వాహనాలు తిరుమలకు

ప్రైవేటు వాహ‌నాల్లో తిరుమ‌ల‌కు వెళ్లేవారు బైపాస్ రోడ్ మార్గం ద్వారా వెళ్లాల‌ని చిత్తూరు జిల్లా ఎస్పీ ర‌మేష్ రెడ్డి సూచించారు. ఆంక్ష‌ల స‌మ‌యంలో ప్రైవేటు వాహ‌నాల‌కు తిరుపతిలోనికి అనుమ‌తి ఉండ‌ద‌ని పేర్కొన్నారు.

క‌రోనా వ్యాప్తి కట్టడికి సంపూర్ణ ఆంక్ష‌లు అమలు చేస్తున్న నేప‌థ్యంలో తిరుపతి మొత్తం కంటైన్‌మెంట్ జోన్లు ఉంటాయ‌ని తెలిపారు.

అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులు మిన‌హా మిగ‌తా దుకాణాల‌కు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు.

ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా భౌతిక దూరం పాటించాల‌ని కోరారు. ద్విచ‌క్ర వాహ‌నాల్లో సైతం ఒక్క‌రికే అనుమ‌తి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే జ‌రిమానాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఈ ఆంక్ష‌లు వ‌చ్చే నెల 5 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపారు.