గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (16:38 IST)

కోక- కోలా ఇండియా సురక్షిత తాగునీటి ఏర్పాటు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 20,000 మందికి ప్రయోజనం

కోక- కోలా ఇండియా ఫౌండేషన్ ఆనందన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాలలో జలధార ఫౌండేషన్, వాటర్ హెల్త్ ఇండియాలతో కలసి ఏడు వాటర్ హెల్త్ సెంటర్స్(డబ్ల్యూహెచ్ సి)ల కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ జిల్లాలకు చెందిన 20,000 మందికి నీటి శుద్ధి కేంద్రాలు మరియు సుస్థిరదాయక జీవనోపాధులు కల్పించడంపై ఈ ఫౌండేషన్ వ్యయం చేసింది.
 
సురక్షిత తాగు నీటిని వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తేవడం ద్వారా ఇక్కడ ప్రజల ఆరోగ్యం మెరుగుదలకు గ్రామీణులు నీళ్ల ద్వారా వ్యాప్తి చెందే రోగాల బారిన పడటాన్ని తగ్గించేందుకు తోడ్పడినట్లవుతుంది. మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ జిల్లాలో కూడా ఈ తరహా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఇదేవిధమైన ప్రాజెక్టులను ఈ ఫౌండేషన్ చేపట్టింది.
 
కోక-కోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఏషియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్ & సస్టెయినబిలిటీ) ఇష్తెయాక్యూ అంజాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘జీవించేందుకు నీళ్లు తప్పనిసరి. ఆర్యోగవంతమైన సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక సురక్షిత తాగు నీళ్లు. స్థానిక సమాజాల భాగస్వామ్యంతో కోక-కోలా ఇండియా ఫౌండేషన్ ఆనందన భారతదేశవ్యాప్తంగా గత పదేళ్లుగా సురక్షిత మరియు పరిశుభ్ర తాగునీటిని అందించే పరిష్కారాల్లో భాగమవుతూ తన వంతు తోడ్పాటును అందిస్తోంది.
 
ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్  జిల్లాలలో ఈ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయడంలో మరియు అక్కడి ప్రజలపై సానుకూల ప్రభావం కనబర్చడంలో మా భాగస్వామి  జలధార ఫౌండేషన్, వాటర్ హెల్త్ ఇండియా మాకు తోడ్పడ్డాయి. సమాజం, పర్యావరణం కోసం మా వంతు తోడ్పాటు అందించే ప్రయత్నాలను మేము కొనసాగిస్తాం’’ అని అన్నారు.
 
జలధార ఫౌండేషన్‌కు చెందిన శ్రీ బి.రామానంద్ మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నీటి ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందడం అధికమవడం, దానికి తోడు పరిశ్రమ వర్గాల నివేదికల ప్రకారం భూగర్భజలాలు నిరంతరం కలుషితం కావడం ఈ ప్రాంతాల ప్రజల తాగునీటి కష్టాలకు నిదర్శనంగా ఉంటున్నాయి. నీటి పరిష్కారాలను అమలు చేసినప్పుడు గ్రామీ ణులు దీర్ఘకాలంలో గొప్ప ప్రయోజనాలు పొందగలుగుతారని మేము ఆశిస్తున్నాం. వినూత్నంగా ఆలోచనలు మరియు సాధ్యపడే పరిష్కారాలకు గాను కోక-కోలా ఇండియా కు, మా సాంకేతిక భాగస్వామి వాటర్ హెల్త్ ఇండియాకు మా ధన్య వాదాలు’’ అని అన్నారు.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పలు తక్కువ ఆదాయ వర్గాలు శుభ్రమైన తాగునీటి సదుపాయం లేకపోవడం అనే సమస్య ను ఎదుర్కొంటున్నాయి. భూగర్భజలాలు కలుషితం కావడం అనేది నీటి ద్వారా వచ్చే వ్యాధులు అధిక మయ్యేలా చేస్తోంది. అది సమాజ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ జిల్లాలకు చెందిన పలు భూగర్భ జల నమూనాల్లో లవణీయత, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఐరన్, నైట్రేట్ అనేవి కీలకమైన కాలుష్యకారకాలుగా ఉం టున్నాయి. పరిశ్రమలు విడుదల చేసే కలుషితాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. తాగు నీటి సరఫరాకు వీలు లేకపోవడంతో ప్రజలు తప్పనిసరై శుద్ధి చేయని బోర్ పంపు నీళ్లను తాగాల్సి వస్తోంది’’ అని అన్నారు.
 
ఈ ప్రజలకు తోడ్పడేందుకు కోక-కోలా ఇండియా ఫౌండేషన్ ఆనందన వాటర్ హెల్త్ సెంటర్స్ (డబ్ల్యూహెచ్ సి)లుగా వ్యవహరించే ఏడు నీటి శుద్ధి మరియు పంపిణి కేంద్రాలకు అండగా నిలిచింది. ఇవి ప్రస్తుతం పని చేస్తు న్నాయి మరియు గణనీయ సంఖ్యలో ప్రజలకు సురక్షిత, పరిశుభ్రమైన నీటిని అందుబాటు ధరలో అందిస్తు న్నాయి. అదనంగా వాటర్ హెల్త్ సెంటర్స్ (డబ్ల్యూహెచ్ సి) ఏర్పాటు అనేది ఈ ప్రాంతంలో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధికి కూడా తోడ్పడుతోంది. తద్వారా ఈ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి కూడా  తోడ్పడుతోంది.
 
సమాజాభివృద్ధి మరియు సమగ్ర మెరుగుదలలకు గాను నీటి సంరక్షణ మరియు యాజమాన్యం దిశగా పని చేసేందుకు కోక – కోలా ఇండియా ఫౌండేషన్ ఆనందన కట్టుబడి ఉంది. 2007 నుంచి కూడా ఈ ఫౌండేషన్ 150కిపైగా వాటర్ రిప్లెనిష్ మెంట్ నిర్మాణాలను నెలకొల్పింది. వీటి సామర్థ్యం 13 బిలియన్ లీటర్లకు పైగా ఉంటుంది. 550కి పైగా గ్రామాల్లో 8,00,000 కుపైగా జీవితాలకు విలువను జోడిస్తున్నాయి.