1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Man killed in road mishap at Outer Ring Road

కారులో మంటలు.. డ్రైవర్ సజీవదహనం

Sanga Reddy
బాహ్యవలయ రహదారి (ఔటర్ రింగ్ రోడ్డు)పై వెళుతుండగా కార్‌లో మంటలు రేగడంతో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ బాహ్యవలయ రహదారిపై ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
బొల్లారం వైపు నుంచి ముత్తంగి వైపు వెళుతున్న టీఎస్‌ 07 జీఎం 4666 నంబర్ గల కారు రోడ్డుపై దగ్దం అవుతుండటంతో హుటాహుటిన అగ్ని మాపకసిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. డ్రైవర్ సీట్లో కూర్చున్న వ్యక్తి పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించారు. 
 
మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. మంటలు అంటుకోవడానికి గల కారణం కూడా బోధపడలేదని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివారాలు తెలుసుకున్న తర్వాత సంబంధికులకు సమాచారం అందిస్తామని చెప్పారు. 
తర్వాతి కథనం
వీర జవానుకు భార్య సెల్యూట్.. తుదిసారి ముద్దు.. ఐ లవ్యూ..