శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (09:44 IST)

అలా అడిగిన పాపానికి కాట్ల కుక్కలా కరిచేశాడు..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. కుక్కను ఎందుకు కొడుతున్నావు అని అడిగిన పాపానికి సదరు వ్యక్తి కాట్ల కుక్కలా పైనపడి కరిచేశాడు. ఈ ఘటన ఇండోర్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇండోర్‌లోని సంజయ్ నగర్‌కు చెందిన బాబీ అనే వ్యక్తి ఓ వీధి కక్కను దొడ్డుకర్రతో చావబాదుతున్నాడు. దీన్ని చూసిన రవి చౌహాన్ అనే వ్యక్తి... కుక్కను ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నించాడు. అంతే... రవి చౌహాన్‌పై కాట్ల కుక్కలా పడి అతనిని కరిచేశాడు. 
 
"నా యిష్టం. నేను కుక్కను కొడితే నీకెందుకు.. నీవు అడ్డు ఎందుకు వస్తున్నావ్ అంటూ రవిపై మండిపడ్డాడు. అంతటితో శాంతించని బాబి.. రవిపై కాట్ల కుక్కలా పడి నోటికొచ్చినట్టు కరిచాడు. రవి చౌహాన్ లబోదిబోమంటున్నా వదిలిపెట్టకుండా కిందపడేసి మరీ కరిచాడు.
 
వీరిద్దరూ ఇలా కలబడుతుండగానే ఆ కుక్క అక్కడ్నించి బతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయింది. అనంతరం తీవ్ర గాయాలపాలైన రవి చౌహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.