సంబంధిత వార్తలు
- అబ్బెబ్బె.. నేను రాజీనామా చేయలేదు.. అంతా ఉత్తుత్తిదే : వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
- తితిదే అన్నప్రసాద కేంద్రాలు వైకాపా ప్రభుత్వ అవినీతి కేంద్రాలుగా మారాయి : నారా లోకేశ్
- ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు.. మార్చి 6న ఖరారు?
- జగన్ ముఖ్యమంత్రికి అర్హుడైతే.. పిల్ వేసేందుకు నాకు అర్హత లేదా : వైకాపా రెబెల్ ఎంపీ
- మృతి చెందిన బంధువుకు పింఛన్ ఆపేసిన వలంటీరుపై కీచకరపర్వం... వైకాపా నేతల దాష్టీకం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం?
ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నారని తాజా సమాచారం. వచ్చేనెలలో ముద్రగడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఆయన జనవరి 1వ తేదీన ప్రజాసేవా కార్యక్రమాలను ప్రారంభించి, జనవరి 2న అధికారికంగా వైఎస్సార్‌సీపీలో భాగమవుతారని సన్నిహితులు సూచిస్తున్నారు.
పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ముద్రగడ పార్టీ అధిష్టానానికి అనేక ఫిర్యాదులు అందడంతో ప్రస్తుత ఇన్‌చార్జి దొరబాబు స్థానంలో ముద్రగడ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ ముఖ్యమైన పరిణామంపై చర్చించేందుకు తాడేపల్లిలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో మంత్రి విశ్వరూప్, పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు సమావేశం కానున్నారు. ముద్రగడ వైఎస్సార్‌సీపీలోకి చేరికపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తర్వాతి కథనం
