సంబంధిత వార్తలు
- మూకుమ్మడి రాజీనామాల దిశగా వైకాపా ... జగన్ నిర్ణయం
- చీఫ్ జస్టీస్ దీపక్ మిశ్రాపై అభిశంసన : 60 మంది ఎంపీలు సంతకం?
- దొరలంటే ఇప్పుడు మీడియా ఆసాములే.. నా తల్లిని తిట్టించడంలో ఆ ముగ్గురు?: పవన్
- చంద్రబాబుకు పవన్ శుభాకాంక్షలు... లోకేశ్ బండారం బయటపెట్టాడు...
- నరేంద్ర మోదీపై నారా లోకేష్ ట్వీట్.. బాధాకరమంటూ పీఎంవో రీ ట్వీట్
వైసీపీ తీరు ఎలా వుందంటే..? నారా లోకేష్ ఎద్దేవా
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న నిరసనపై వైసీపీ ప్రతి దీక్షలు చేస్తుంటే చూసేందుకు హాస్యాస్పదంగా వుందని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ఏపీ
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న నిరసనపై వైసీపీ ప్రతి దీక్షలు చేస్తుంటే చూసేందుకు హాస్యాస్పదంగా వుందని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ఏపీ ప్రజల భవిష్యత్తులో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 30వ తేదీన తిరుపతిలో సీఎం చంద్రబాబు దీక్ష చేపడుతున్న నేపథ్యంలో.. అదే రోజు వైసీపీ విశాఖలో నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు వైసీపీ ప్రకటించడంతో లోకేష్ ఇలా స్పందించారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని వైసీపీ పాటిస్తోందని నారా లోకేష్ అన్నారు.
ఇదిలా ఉంటే గవర్నర్ నరసింహన్‌తో జరిగిన సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతోపాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని సీఎం గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది.
